పలువురిని పరామర్శించిన చల్మెడ

viswatelangana.com
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లింగంపేట్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త గోపు పెద్దసాయిరెడ్డి ఇటీవల మృతిచెందగా కుటుంబాన్ని, వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పోతరాజు రాజేశం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబ సభ్యులను, పిడుగుపాటుతో మృతి చెందిన గంగ నరసయ్య కుటుంబ సభ్యులను, కాచారం మాజీ సర్పంచ్ చిట్యాల సురేష్ సోదరుడు చిట్యాల సాగర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కుటుంబ సభ్యులను ఆదివారం రోజున బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. చలిమడ లక్ష్మీనరసింహారావు వెంట జడ్పీవైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మేడిపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్ శంకర్, అభిలాష్,అంగడి ఆనంద్ నాయకులు గోపి, చిన్నమల్లయ్య, లోక రవీందర్ రెడ్డి, ఎంపిటిసి అజిత్ రావ్, భూమేష్ గౌడ్,సింగల్ విండో చైర్మన్ కానుగంటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, లక్ష్మీరాజం, జలపతి రెడ్డి, కట్ట శేఖర్, అజయ్, ఆదిరెడ్డి, వెంకటేష్, దీపక్, రాకేష్, నవీన్, సాయికృష్ణ, చిట్యాల నరేష్, పానుగంటి సంజీవ్, తదితరులు ఉన్నారు.



