వెల్గటూర్
వెయ్యి గొంతులు లక్ష డప్పు లు సన్నాహక సభకు తరలిన ఎమ్మార్పీఎస్ నేతలు

viswatelangana.com
January 18th, 2025
వెల్గటూర్ (విశ్వతెలంగాణ) :
ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 07 న హైదరాబాదులో నిర్వహిస్తున్న వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ధర్మపురిలో నిర్వహిస్తున్న సన్నాహక సభకు ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న కు మద్దతుగా ఎండపల్లి మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు చేన్న కుమారస్వామి ఆధ్వర్యంలో మండలంలోని గుల్లకోట ఎండపల్లి కొత్తపేట పడకల్ గ్రామాల నుండి పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు డప్పు చప్పుళ్ళ తో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ హైదరాబాదులో నిర్వహించే కార్యక్రమానికి మండల వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వర్గీకరణకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.


