జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ లో సత్తా చాటిన చరిత్ మోడల్ స్కూల్ విద్యార్థులు

viswatelangana.com
జగిత్యాల డిస్ట్రిక్ట్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన యునైటెడ్ డిస్ట్రిక్ట్ తైక్వాండో ఛాంపియన్షిప్ లో కోరుట్ల చరిత్ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. చరిత్ మోడల్ స్కూల్ కు చెందిన 06 గురు విద్యార్థులు పోటీల్లో పాల్గొని 01 గోల్డ్, 01 సిల్వర్, 03 బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ బి.సురేష్ తెలిపారు. మొట్టమొదటిసారిగా చరిత్ మోడల్ స్కూల్ విద్యార్థులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాల్గొని ఐదు పథకాలు సాధించడం జరిగిందనీ మాస్టర్ తైక్వాండో క్లబ్ వ్యవస్థాపకులు, నేషనల్ రెఫరీ, నేషనల్ కోచ్, జగిత్యాల డిస్ట్రిక్ట్ తైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నావనంది రమేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఇంతటి విజయాన్ని సాధించిన చరిత్ మోడల్ స్కూల్ విద్యార్ధులను స్కూల్ ప్రిన్సిపల్ బి సురేష్, సంధ్య, అధ్యాపక బృందం అభినందించారు.



