రాయికల్
ఉత్తమ మహిళా ఉద్యోగిగా ఏపీవో మెండె దివ్యశ్రీ

viswatelangana.com
March 16th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయికల్ మండల ఉపాధి హామీ పథకం లో తన అద్భుతమైన సేవలను అందించిన అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ (ఏపీవో) మెండె దివ్యశ్రీ ఉత్తమ మహిళా ఉద్యోగిగా ఎంపికయ్యారు. దివ్యశ్రీ తన కృషి, నిబద్ధత, పట్టుదలతో ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, మహిళా శక్తికి నిలువుటద్దంగా నిలిచారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు చేసి, అనేక కుటుంబాలకు ఉపాధి కల్పనలో కీలక భూమిక పోషించారు. ఆమెకు ఈ గుర్తింపు లభించడం ద్వారా, సమాజంలో మహిళా సాధికారతకు ఆమె చూపించిన మార్గదర్శకత్వానికి, సేవా స్పూర్తికి ఘనమైన ప్రతిఫలంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆదివారము ఆమెను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సన్మానించారు.



