రాయికల్
అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

viswatelangana.com
September 12th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని రాయికల్ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు తాటిపాముల విశ్వనాథం అన్నారు. రాయికల్ మార్కండేయ మందిరంలో పద్మశాలి సేవా సంఘం మరియు యువజన సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం మరియు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం, దానాల్లో ఉత్తమమైన దానం అన్నదానమని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఒకపూట భోజనం పెట్టి ఆకలితో ఉన్న వారి కడుపు నింపొచ్చు. ఇలా ఇతరుల కడుపు నింపడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘ సభ్యులు, యువజన సంఘ సభ్యులు, పోప మరియు మహిళా సంఘ సభ్యులు, అష్టమవాడ పెద్దలు పాల్గొన్నారు.



