రాయికల్
పహల్గామ్ ఉగ్రదాడి లో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ…

viswatelangana.com
April 26th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
పహల్గామ్ ఉగ్రవాదులు టూరిస్టులపై దాడి చేసిన సంఘటనను నిరసిస్తూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శనివారం సాయంత్రం గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని అశ్రు నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, సీనియర్ నాయకులు, యువకులు, గ్రామ సేవా సమితి అధ్యక్ష కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.



