రాయికల్
పాఠశాలకు బహుమతి అందజేసిన పూర్వ విద్యార్థులు

viswatelangana.com
May 22nd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో 1998-99 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలిసి గ్రామ హైస్కూల్లో 25000 రూపాయల విలువగల మెయిన్ గేట్ ను చేయించి ప్రధానోపాధ్యాయులకు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలకు తమ వంతు ఎంతో కొంత సహాయం చేయాలని ఉద్దేశంతో అందరం కలిసి చేశామని వారన్నారు వీరు చేసిన సహాయానికి ప్రధానోపాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాటిపల్లి గంగారెడ్డి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



