పాఠశాలలో ప్రజా పాలన దినోత్సవం.. జెండా ఆవిష్కరణ చేసిన ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు..

viswatelangana.com
కోరుట్ల పట్టణ యస్.ఆర్.యస్.పి క్యాంప్ గడి పాఠశాలలో మంగళవారం రోజున ఉదయం ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకంను ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజా పాలన యొక్క ప్రాముఖ్యత గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు మాట్లాడుతూ… హైదరాబాదు సంస్థానం స్వాతంత్ర భారతదేశంలో కలిసిన రోజు 1948 సెప్టెంబర్ 17 న విలీన దినోత్సవం అని, విద్రోహ దినమని మరికొందరు సమైక్య దినోత్సవం అని రకరకాల భాషలు చెప్పబడింది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేశారు. సకలజనులు, బానిస సంస్కృతికి వ్యతిరేకంగా వీరనారి చిట్యాల ఐలమ్మ రజాకర్ల రాక్షస క్రీడలకు బలైపోయిన ఎందరో పేదలు వారి ఆగడాలకు వ్యతిరేకంగా, పెత్తందారి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా గుప్తలనే ఆయుధంగా చేసి పోరాటం చేసి ఎందరో అమరవీరుల ఫలితమే నేటి ప్రజా పరిపాలన దినోత్సవం అని కొనియడారు.ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, ధన లక్ష్మి కరాటే మాస్టర్ అల్లే రమేష్ లు పాల్గొన్నారు.



