viswatelangana.com
Date of Publish : 02 October 2024, 4:23 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పారిశుద్ధ పనులలో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్మికులకు స్వచ్ఛత హి సేవ లో భాగంగా సన్మానం

మునిసిపల్ కమీషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవకార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణంలో పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న కనూరి కిరణ్ కుమార్, బొల్లె నరేష్, చిట్యాల బుచ్చమ్మ, రాగుల భాగ్య, వావిలాల కనకతార లను ఉత్తమ పనితీరు కనబరిచినందుకు వారికి శాలువాతో సన్మానించి, ప్రశంసా పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ చిట్యాల శ్రీనివాస్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శివకుమార్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గొనేల మహేష్ అలాగే మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

Change News Type