viswatelangana.com
Date of Publish : 10 October 2024, 2:21 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కు నివాళులు అర్పించిన దూలూర్ గ్రామస్తులు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలూర్ గ్రామంలో పారిశ్రామిక దిగ్గజం అయిన రతన్ టాటా మరణ వార్త విని గ్రామస్తులు ఎంతో ద్రిగ్భాంతికి లోనయ్యారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, జలంధర్, కృష్ణారెడ్డి, సాయిరెడ్డి, నాగరెడ్డి, రవి, రాజరెడ్డి, గంగారెడ్డి, నరేష్, మల్లయ్య, మహేంధర్, మారుతి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Change News Type