viswatelangana.com
Date of Publish : 13 May 2024, 1:00 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న కారోబార్ విధుల నుండి తొలగింపు

జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని గోవిందారం గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేయగా ఉద్రిక్తత వాతావరణానికి తెర పడింది. వివరాల్లోనికి వెళితే ఆ గ్రామ కారోబార్ పోలింగ్ కేంద్రం వద్ద ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు ఇతర పార్టీల నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో పోలింగ్ కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ విషయంపై ఎంపీడీవో చిరంజీవిని వివరణ కోరగా ఆ గ్రామంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి కి అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో ఆ కార్యదర్శి ఆదేశాలనే సారాంశం. కారోబార్ కి పోలింగ్ కేంద్ర బాధ్యతలు అప్పజెప్పడం తో సమస్య ఏర్పడిందని, తక్షణమే కారోబార్ ని విధులనుండి తొలగిస్తున్నారని అధికారులు తెలిపారు

Change News Type