పార్లమెంట్ ఎంపీ ఎన్నికల్లో మాకు అన్యాయం చేశారు- కథలాపూర్ లో ఆశా వర్కర్ల ఆవేదన

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఆశా వర్కర్ల యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మమత,దివ్య లు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సోమవారం జరుగగా ఆ రోజు ప్రతి ఒక్క ఆశా వర్కర్ పని చెయ్యాలని పోలింగ్ బూత్ కి ఒక ఆశా అని డ్యూటీ వేశారని అలా మన వేములవాడ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో చందుర్తి, రుద్రంగి, కథలాపూర్, మేడిపల్లి లు ఉండగా ప్రతి ఒక్క నియోజకవర్గం లో ప్రతి బూత్ కు 600 రూ. చొప్పున ఇచ్చినారని అనగా అటెండర్ కు 600 రూ., అంగన్వాడీ టీచర్లకు 600 రూ. ఇస్తే ఇక్కడ మాత్రం ఆశా వర్కర్లకు 300 మాత్రమే ఇచ్చినారని మరి ఇది ఎలా జరిగిందని? అందరికీ సరి సమానం ఇవ్వాలని మేము అడగడం జరిగిందని అడిగితే కలెక్టర్ చెపితేనే ఇచ్చామని అన్నారని మేము కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి సిద్దంగా ఉన్నామని అంతే కాకుండా తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఈ విషయాన్నీ కలెక్టర్ వరకు తీసుకెళ్తామని తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాలలో ఆశా వర్కర్లకు 600 రూ ఇచ్చినారని, కేవలం వేములవాడ నియోజకవర్గం లో మాత్రమే 300 రూ వచ్చినాయని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు



