కోరుట్ల

కోర్టు ఆర్డర్ భేకాతారు చేసిన మున్సిపల్ అధికారులు డాక్యుమెంట్ కే మద్దతు తెలిపిన మున్సిపల్ సంబంధిత అధికారులు

viswatelangana.com

March 12th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని ఏకిన్ పూర్ 6 వ వార్డులో వింత ఆ వార్డులో ఇద్దరి అన్నతమ్ముల మధ్య ఉన్నా భూమి గురించి ఆ ఇద్దరిలో భూమి యజమాని అయినా అన్న మున్సిపల్ కార్యాలంలో పాత కమిషనర్ కి పిర్యాదు 2025 పిబ్రవరి 25 న చేసాడు, కానీ ఇక్కడి అధికారులు ఆ పిర్యాదు పట్టించుకోలేదు మల్లి పిర్యాదు దారుడు 2025 మార్చి 6 న మున్సిపల్ ఆఫీస్ కు వెళ్లగా అక్కడ పిర్యాదు లేదాని మీరు ఎవరికీ ఇచ్చారని మున్సిపల్ సిబ్బంది అన్నారు. కాగా పిర్యాదు దారుడు పాత కమిషనర్ ఇచ్చానని అనగా అక్కడ కొంత టైం వరకు వెతుకగా ఉందాని మున్సిపల్ అధికారులు తెలిపారు. అప్పుడు మరల మున్సిపల్ ముద్ర వేసి రిసీవుడు ఇచ్చారు. కాగా పిర్యాదు దారుడు పలుమార్లు సంబంధిత అధికారులను కలిసిన ఎలాంటి స్పందన రాలేదని అలాగే మరల 2025 మార్చి 12 బుధవారం రోజున మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళాడు. ఆ కార్యాలయంలో ఉన్నా సంబంధిత అధికారిని కలిసి అట్టి పిర్యాదు పై మాట్లాడుతూ నా యొక్క పట్టభూమికి అడ్డంగా ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని తెలిపారు. అనంతరం సంబంధిత అధికారి గోడ నిర్మాణం చేస్తున్నా ప్రదేశానికి ఇద్దరి సిబ్బందిని పంపి అక్కడి పనులను ఆపించారు. కానీ అక్కడి నుండి సిబ్బంది, మున్సిపల్ కార్యాలయానికి చేరుకొక ముందే మల్లి నిర్మాణాలు ప్రారంభించారు. మల్లి సంబంధిత అధికారి స్వయంగా వెళ్లి అట్టి పనులను అపి, మల్లి ఇక్కడ ఎలాంటి పనులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపి అక్కడినుండి బయలుదేరాడు, అక్కడ గోడ నిర్మిస్తున్న వ్యక్తి మున్సిపల్ కార్యాలయనికి వెళ్లి నాకు అక్కడ గోడ కట్టుకోవడానికి స్థలం ఉన్నదని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నావని పిర్యాదు చేసాడు. కానీ మొదటగా పిర్యాదు చేసిన వ్యక్తి నాకు అట్టి భూమిపై కోర్ట్ యొక్క ఇంజనక్షన్ ఆర్డర్ అలాగే ఆ డాక్యుమెంట్ ఫేక్ అని నేను అట్టి డాక్యుమెంట్ పై కోర్టులో కేసు వేసానని తెలిపినా అతని మాటలు పట్టించుకోకుండా అధికారులు డాక్యుమెంట్ ఉన్నా వ్యక్తికీ మద్దతుగా నిలిచి దెగ్గర ఉండి అక్కడి గోడ నిర్మాణం పూర్తి అయ్యే వరకు అక్కడే ఉన్నారని మున్సిపల్ అధికారులే గోడ కట్టెందుకు మద్దతు ఇచ్చారని అలాగే కోర్టు ఆర్డర్ భేకాతారు చేసారని, పిర్యాదు దారుడు చెప్పిన వినకుండా వారు ఆలా చేయడం పై పలు అనుమానాలు వస్తున్నాయి, అలాగే కోర్టు ఇచ్చిన తీర్పు పట్టించికోకుండా గోడ నిర్మాణానికి అండగా నిలిచిన అధికారులపై, పై అధికారులు చర్యలు తీసుకోవాలని పిర్యాదు దారుడు వాపోయాడు.

Related Articles

Back to top button