రాయికల్

అల్లిపూర్ గురుకుల పాఠశాలలో కరీంనగర్ రీజనల్ కోఆర్డినేటర్ గౌతం తనిఖీలు

viswatelangana.com

April 10th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని అల్లిపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై దాడి చేసిన ఘటనలో విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన నేపథ్యంలో గురుకుల పాఠశాలల కరీంనగర్ రీజనల్ కోఆర్డినేటర్ గౌతమ్ బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని రికార్డులను పరిశీలించి విద్యార్థుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు చేసిన ఘటనపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ గౌతమ్ మాట్లాడుతూ ఆరవ తరగతి విద్యార్థి పై ఏడవ తరగతి విద్యార్థి స్నేహపూర్వకంగా ఉండేవాడని కానీ బాత్రూంకు వెళ్లే సందర్భంలో సీనియర్ మరియు జూనియర్ విద్యార్థుల మధ్య జరిగిన ఘటనలో జూనియర్ విద్యార్థి గాయపడినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థి పాఠశాలలో ఉపాధ్యాయులకు తెలియజేయకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆశ్రయించి ఆందోళన చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. ఉగాది సందర్భంగా సెలవు దినం కావున పాఠశాలలో ఉపాధ్యాయులు దశల వారిగా విధులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. విద్యార్థి గాయపడిన విషయం ఉపాధ్యాయులకు తెలుపకపోవడం వల్లే తల్లిదండ్రులు ఆగ్రహించారని ఆయన వివరించారు. కాగా ఈ ఘటనలో విద్యార్థి పై దాడి చేసినట్లు ఆరోపిస్తున్న విద్యార్థి కి కౌన్సిలింగ్ నిర్వహించామని, పద్ధతి మార్చుకోకపోతే రానున్న అకాడమీకు సంవత్సరంలో వేరే పాఠశాలకు బదిలీ చేస్తామని ఆయన తెలిపారు. అలాగే పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని అలాగే సెలవు దినాలలోఒకరికి అదనంగా మరొక ఉపాధ్యాయుడు, అనగా ఇద్దరు విధులు నిర్వర్తించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందివ్వడంతో పాటు వైద్యులను సంప్రదించాలని విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.

Related Articles

Back to top button