viswatelangana.com
Date of Publish : 26 January 2024, 9:14 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పిఏసిఎస్ సీఈవో అరుణ్ సేవలు భేష్, అభినందనలు తెలిపిన గ్రామస్తులు, మిత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు

ప్రశంసా పత్రం అందుకున్న ఉషకోల అరుణ్

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో ఉషకోల అరుణ్ రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రైతులకు కావాల్సిన పంట రుణాలు, తార్పాలిన్ లు, యూరియా ఎరువులు ఇతర అవసరాలు తీరుస్తూ రైతుల మన్ననలు పొందుతున్నాడు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను భూషణరావుపేట సొసైటీ సీఈవో ఉషకోల అరుణ్ కు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మరియు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా జగిత్యాల కలెక్టరేట్ లో ప్రశంస పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా అరుణ్ కుటుంబ సభ్యులు మిత్రులు ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అరుణ్ ని గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

Change News Type