కథలాపూర్
పీఎం కిసాన్ పథకం పొందాలంటే రైతులందరూ ఈకేవైసీ పూర్తి చేయాలి
viswatelangana.com
March 4th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన, ఇప్ప పెళ్లి గ్రామాలలో పీఎం కిషన్ పథకంకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియను ఎఇఓ లు శేఖర్, వైష్ణవి లు చేయటం జరిగింది. ఈ పథకానికి సంబంధించి 2019 ఫిబ్రవరి 1 వరకు ఎవరైతే పాస్ పుస్తకాలు జారి చేయబడ్డాయో ఆ రైతులందరూ లబ్ధి పొందుతారు. ప్రస్తుతం లబ్ధి పొందుతున్న రైతులు ఈకేవైసీ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తిచేసుకుంటేనే వారికి తర్వాత విడుతల డబ్బులు అందుతాయని, ప్రస్తుతం కథలాపూర్ మండలంలో ఆన్ని గ్రామంలో కలిపి 57 మంది రైతులు ఇంకాను ఈకేవైసీ ప్రక్రియా పూర్తి చేయలేరని వారందరు సంబంధిత ఏఈఓ దగ్గర గాని, మీసేవలో గాని ప్రక్రియను పూర్తి చేసి పీఎం కిసాన్ పథకం లబ్ధి పొందగలరని తెలిపారు



