కోరుట్ల
పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిల్ అత్యవసర సమావేశం

viswatelangana.com
September 30th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
పురపాలక సంఘ కార్యాలయంలో చైర్ పర్సన్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పదిహేను అంశాలను పొందుపరచగా అందులో పదిహేను అంశాలను మెజారిటీ కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. కానీ అంశం 2 మరియు 14 లను 12 మంది వార్డు సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ అన్నం లావణ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, టి.పి.ఓ ఎ. ప్రవీణ్ కుమార్, జె.ఎ.ఓ వి. శివకుమార్, టి.పి.యస్. రమ్య, ఎ.ఇ. జె. లక్ష్మీ, టి, అరుణ్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు అలాగే ఆఫీస్ సిబ్బంది పాల్గోన్నారు.



