viswatelangana.com
Date of Publish : 11 March 2025, 4:49 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పూడూరు రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు రైతు వేదిక లో మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమం వీడియో కాన్ఫారెన్స్ జరిగింది. వేసవి పంటలలో యాజమాన్య పద్ధతులు, ప్రస్తుత వరి పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది.వరి పంటకు సంబంధించిన, వ్యవసాయ యాంత్రీకరణ కు సంబంధించిన ఇతర సందేహాలను వెల్మల రామిరెడ్డి అను రైతు అడిగి తెలుసుకోవడం జరిగినది. ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు తమకున్న సందేహాలను నేరుగా శాస్త్రవేత్తలతో అడిగి తెలుసుకునే అవకాశం కలదు.దీనిలో ఏఈఓ లు రాజేష్,శ్రీలత,గ్రీష్మ, రైతులు పాల్గొన్నారు

Change News Type