కథలాపూర్
పూర్తి కాని వరి ధాన్యం కొనుగోలు- ఆందోళన చెందుతున్న రైతులు

viswatelangana.com
May 26th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాలకు, కల్లాలకు చేరిన వరి ధాన్యాన్ని తేమ ఉందని, తడిసిందని కొనకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. భారీ ఆశలతో యాసంగి వరిసాగు చేపట్టిన రైతులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొంటామని ప్రభుత్వం ప్రకటించినా గడిచిన 30 రోజులుగా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి.ఎవరి నిర్లక్ష్యం ఇది? దీనికి ఎవరు బాధ్యులు? వివిధ గ్రామాల్లో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు లారీలు లేక స్తంభించిపోవడంతో రైతులు వడ్ల కుప్పల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఆలస్యమైన కొద్దీ అకాల వర్షాలకు వరికుప్పలు తడవడంతో లాకలు వస్తున్నాయని, అంతేకాకుండా ఆరుగాలం కష్టం వృథా అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.



