మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు అందజేత…

viswatelangana.com
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం ద్వారా వంటగ్యాస్ సిలిండర్ 5 వందల రూపాయలకే పంపిణీ చేయాలని లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందాని, అందులో భాగంగా అందుకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను శుక్రవారం లబ్ధిదారులకు అందజేసినట్లు 13వ వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మహాలక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారిక దారిద్రియ రేఖన దిగువన ఉన్న వారిపై ఆర్థిక భారం తగ్గించడం కోసం వారికి కాలుష్య రహిత వంట వండుకోవడానికి ఈ పథకంలో ఎంపికైన కుటుంబాలకు వినియోగం ఆధారంగా ఎల్పిజి సిలిండర్ లో పరిమితం చేయబడతాయని, లబ్ధిదారులు సిలిండర్ అందిన తర్వాత సబ్సిడీ నగదు మీ బ్యాంకు ఖాతాలో నాలుగు రోజుల్లో జమ అవుతుందన్నారు. ఒకవేళ జమకాని లబ్ధిదారులు ఉన్నట్లయితే ప్రొసీడింగ్ పత్రాలలో ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మన ఖాతాకు సబ్సిడీ అమౌంట్ ను క్లియర్ చేసుకోవచ్చునన్నారు. ఇట్టి సబ్సిడీ మంజూరు చేయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ తిరుమల వసంత గంగాధర్, మున్సిపల్ వార్డు ఇంచార్జ్ జగ్గల్ల రమేష్, ఆర్పీలు వనిత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.



