జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణరావుపేట జడ్పీ హైస్కూల్లో 2002 – 2003 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం భూషణరావుపేటలోని పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాలలోని సరస్వతి విగ్రహానికి పూలమాలవేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పూర్వ విద్యార్థుల సమావేశమై పాత జ్ఞాపకాలు నెమరు వేసుకొని ఆడి పాడారు.. అనంతరం సాముహిక భోజనం చేశారు. పాఠశాలలో 2002 -2003 బ్యాచ్ వారు సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు..