కథలాపూర్
ముందస్తు బడి బాట

viswatelangana.com
April 28th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలోని ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వార్యంలో మందస్తు బడిబాట కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరికొండ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొమ్మెన ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. మధు కుమార్ ఉన్న సౌకర్యాలను తల్లి దండ్రులకు వివరించడం జరిగింది. ఈ బడి బాట కార్యక్రమంలో 18 మంది విధ్యార్థులు నూతనంగా పాఠశాలలో చేరినట్లుగా ప్రధానోపాధ్యాయులు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రవీంధర్, రవి, రమేష్, భారతి, జయలక్ష్మి, వసంత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లోలం సుమలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



