పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయం

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కొడిమ్యాల రిచిత అనే విద్యార్థినికి ఇదే పాఠశాలలో 2002- 03 పదవ తరగతి చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులు తన విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం ఆర్థిక ప్రోత్సాహం అందజేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఈ విద్యార్థికి ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందజేస్తు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలాగే ఆ విద్యార్థి కుటుంబానికి ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు సూచించారు. తన తోటి పాఠశాల విద్యార్థులు ఆర్థిక సాయం చేయడంతో రిచిత కుటుంబం వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాయికల్ పట్టణ ఎస్సై సుదీర్ రావు మరియు మున్సిపల్ కమిషనర్ మనోహర్ చేతుల మీదుగా ఈ నగదుని అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ పిల్లలకు ఆశీర్వచనాలు ఇచ్చి వాళ్ళు జీవితంలో రాణించాలని ఆకాంక్షిస్తూ వచ్చిన అతిథులను శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్ మరియు ఉపాధ్యాయులు మహేష్, రంజిత్, షారు, రజిత, సంజన, ఇందుజా, మమత, ప్రత్యూష, అపర్ణ, మనీషా, స్రవంతి, మమత, రాజ్యలక్ష్మి, సహస్ర తదితరులు పాల్గొన్నారు.



