రాష్ట్రస్థాయి అబాకస్ పరీక్షల్లో రైసింగ్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
viswatelangana.com
కోరుట్ల విశ్వం ఎడుటెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రోజున నిర్వహించిన రాష్ట్రస్థాయి అబాకస్ జోనల్ కాంపిటీషన్ పరీక్షల్లో రైసింగ్ హైస్కూల్ కోరుట్లకు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ ప్రతిభను చాటారు సీనియర్ విభాగంలో చిట్యాల నరిన్ జూనియర్ విభాగంలో మంద గంగోత్రి, ఎంపిక కాగా జిల్లా స్థాయిలో శ్రీహర్ష, మొహమ్మద్ అర్షాన్ డానియల్,అబ్దుల్ హాది, లు ఎంపికయ్యారు అబాకస్ జోనల్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు నిజామాబాద్ జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ ట్రాస్మా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జయసింహ గౌడ్, అర్బన్ అధ్యక్షులు ధర్మరాజు రాష్ట్ర అడ్వైజర్ మోహన్ లు మెమోంటో సర్టిఫికెట్లతో ఘనంగా సన్మానించి అభినందించారు రైసింగ్ హైస్కూల్ కరెస్పాండెంట్ కుడెల రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు లిఖిత శహనాజ్ బేగం మోహన్ ఉపాధ్యాయులు వెన్నెల సుమయ్య,మమత, కవిత తదితరులు అభినందించారు.



