పెద్దాపూర్ గురుకుల పాఠశాల ముందు ధర్నా నిర్వహించిన ఏబీవీపీ రాష్ట్ర నాయకులు

viswatelangana.com
మెట్ పల్లి, పెద్దాపూర్ గురుకుల పాఠశాల ముందు ధర్నా నిర్వహించిన ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మాడవేణి రంజిత్ కుమార్, అయన మాట్లాడుతూ.ఇందిరమ్మ రాజ్యం అంటే హాస్టల్స్ గురుకుల విద్యార్థుల పిట్టల్లా రాలిపోవడమేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత మంది విద్యార్థులు మరణించిన ఇంతవరకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే, ముఖ్యమంత్రి, మంత్రుల కుటుంబంలో ఇలాంటి ఘటన జరిగితే తల్లితండ్రుల బాధ తెలుస్తది. పాము కాటేసిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి అలాగే హై కోర్టు సిట్టింగ్ జడ్జితో హాస్టల్స్ గురుకులల సమస్యలపైన విచారణ జరిపించాలి, మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల హాస్టల్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్న గన ఆదిత్య అనుమాస్పద స్థితిలో మరణించాడు అదే గదిలో ఉంటున్న హర్ష వర్ధన్, గణేష్ లకు పాము కాటు వేయడం జరిగింది. ఈ విషయం పైన విచారణ చేయాలి మరణించిన విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, పాము కాటు వేసిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి, జైలు కన్నా హీనంగా గురుకుల హాస్టల్స్, రాష్ట్రములో కనీస మౌలిక వసతులు లేని దుస్థితి, శిదిలా వ్యవస్థలో భవనలు ఎప్పుడు కులుతాయో తెలియని దుస్థితి రాష్ట్రములో గురుకులాల హాస్టల్స్ విద్యార్థులకు రక్షణ కరువు, జైలు భోజనం కన్నా దరిద్రంగా హాస్టల్స్ విద్యార్థులు తినే ఆహారం పురుగుల, మెరిగేలా అన్నం తింటున్నారు. ఇదే గురుకులలో విద్యార్థులు ఒకే గదిలో చదువు కుని అదే గదిలో పడుకునే దుస్థితి, శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల రెసిడెన్సీ హాస్టల్లో ను నూతన భవనలు ఏర్పాటు చేయాలి. స్విపర్స్ లేక విద్యార్థులు స్విపర్స్ గా పని చేస్తున్నారు. మరుగుదొడ్లు శుభ్రంగా లేక రోగాల బారిన పడుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో ఆహారం బాగా లేక విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అంటే సమస్యలు ఎంత తీవ్రతరం ఉందొ అర్ధం అవుతుందని మాడవేణి రంజిత్ కుమార్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ రాపాక సాయికుమార్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ మడవేణి సునీల్, మారుతీ, మహాదేవ్, జస్వంత్, అక్షయ్, పవన్, అభి, మణిదీప్, విగ్నేష్, కిరణ్, నితీష్, రాకేష్, మనిష్, నిఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.



