Local

కొండగట్టు ఘాట్ రోడ్ లో ఆటో బోల్తా.

11 మందికి తీవ్ర గాయాలు

viswatelangana.com

March 9th, 2024
Local (విశ్వతెలంగాణ) :

కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా పడిన ఘటన శనివారం రోజు ఉదయం చోటు చేసుకుంది.కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఘాట్ రోడ్ వెంబడ కిందకు దిగుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడడంతో 11 మందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు స్పందించి అంబు లెన్స్ ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి క్షత గాత్రులను తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. ఆటోలోని ప్రయాణికులు మంచిర్యాల జిల్లా మ్యాదరిపేట, లక్షేట్ పేట వాసులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు..

Related Articles

Back to top button