విశ్వశాంతి పాఠశాలలో అంగరంగ వైభవంగా వీడ్కోలు సమావేశం

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో బుధవారము పదవ తరగతి విద్యార్థులకు తొమ్మిదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులందరూ తమ తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాఠశాలలో నర్సరీ నుండి తమకు ఉన్న బంధాన్ని తెలియజేస్తూ ఎంతో ఆనందంగా గడిపారు.ఒక దశలో పాఠశాల విడిచి వెళ్ళే పరిస్థితి ఎదురవుతున్నందున చాలా ఎమోషనల్ కు గురైనారు.అదేవిధంగా మేము పాఠశాల చివరి దశలో ఉన్నాము ఇలాంటి అవకాశం మళ్లీ జీవితంలో రాదు అని తెలిసి చాలా బాధ పడ్డారు.పదవ తరగతి విద్యార్థులందరూ కలిసి చేసిన డ్యాన్స్ పార్టీకే అందంగా నిలిచింది. పాఠశాల ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ ముందుగా పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థినీ, విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పి మీరు అనుకున్నటువంటి మార్కులు, మంచి ర్యాంకులు సాధించి మన పాఠశాలను అగ్రగామిగా నిలపాలని అన్నారు. భవిష్యత్తులో కూడా మీరు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్, ఉపాధ్యాయులు మహేష్, రంజిత్, షారు, రజిత, సంజన, శ్రీజ,శృతి,మనిషా, అపర్ణ, మమత, ప్రత్యూష, మమత, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



