viswatelangana.com
Date of Publish : 28 March 2025, 2:09 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడులు

కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సిసిఎస్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 22,920 రూపాయలు, ఆరు మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని కోరుట్ల పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో అక్రమ, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి,పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

Change News Type