సహకార సంఘం ను సందర్శించిన అధికారులు

viswatelangana.com
కరీంనగర్ జిల్లా సహకార సంఘాల సెక్రటరీ మరియు సిబ్బంది మల్టీ పర్పస్ బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ షాప్ లో భాగంగా టి ఎస్ సి ఏబి ఎల్ టి డి హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి. రాయికల్ ను సందర్శించి రాయికల్ సంఘంలోని వివిధ రకములైన లావాదేవీలు మరియు బిజినెస్ గురించి వివిధ సంఘాల సీఈఓ &సిబ్బంది కి వివరంగా తెలియచేసారు. ఈ సందర్బంగా సంఘం యొక్క లోన్స్ డిపాజిట్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. లోన్స్ డిపాజిట్స్ అప్లికేషన్ ఫార్మ్స్, లెడ్జెర్ ల నిర్వహణ మరియు ఫర్టిలైజర్, పేస్టిసైడ్స్, గురించి వివరించారు. సంఘం యొక్క గోదాంల నిర్వహణ, సామర్థ్యం తెలుసుకున్నారు. టి ఎస్ సి ఏ బి సి టి ఐ అధికారులు విజయ శంకర్, సంపత్ కుమార్ మాట్లాడుతూ సంఘం పని తీరును పరిశీలించి అభినందించారు. సంఘం గత 5 సంవత్సరాలనుండి 15%చొప్పున లాభాలు పెంచుకుంటుందని జిల్లాలోని ఇతర సంఘాలకు ఆదర్శంగా ఉందని తెలిపారు. సంఘ సేవ కార్యక్రమం లో భాగంగా సభ్యుల కు ఇన్సూరెన్స్ కల్పిస్తుంది. సభ్యులు మరణించిన దహన సంస్కారాలకు 10000=00 చెల్లించటం, వాటర్ ప్లాంట్ స్థాపించి మంచి నీటిని అందిస్తుంది,సంఘం లాభాలలో నుండి సభ్యులకు10% డివిడెంట్ అందించటం వంటి కార్యక్రమంల గురించి అధికారులు గుర్తించి ఇతర సంఘాలు కూడా ఈ విధంగా కార్యక్రమలు చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమం లో మహేష్, మున్వార్ అలీ, మార్కండయ్య, అనిల్ కుమార్, ఏనుగు మల్లారెడ్డి,బేతి మోహన్ రెడ్డి,ఎలిగేటి రవికుమార్,కటుకం జగదీశ్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సంఘ సీఈఓలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



