viswatelangana.com
Date of Publish : 27 April 2024, 4:25 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
పోచమ్మ గుడి లో విగ్రహం ప్రతిష్టాపన ఉత్సవాలు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లోని ఒడ్డెలింగాపూర్ గ్రామంలో నిర్మితమైన పోచమ్మ ఆలయంలో శనివారం నాడు పోచమ్మ పోతురాజు బలిపీఠం సారలమ్మ నీరలమ్మ ప్రతిష్ట ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి పురోహితులు చెరుకు మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేములవాడ వేదపండితులు కె.రాజేంధర్ శర్మ పర్యవేక్షణలో ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా విగ్రహాల ఊరేగింపు యాగశాల ప్రవేశం జలాధివాసం మంటపారాధన అ గ్ని ప్రతిష్ట హోమం జరిగాయి. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పాలకుర్తి రవి నాయకులు అను పురం రాజన్న సింగిల్ విండో డైరెక్టర్ నాగుల మల్లయ్య యాచమనేని దీపక్ రావు గడ్డంరాజారెడ్డి సూర పాపయ్య భక్తులు గ్రామస్తులు అర్చకులు చొప్పకట్ల కార్తీక్ నందగిరి భాను గోవిందుల శ్రీనివాస్ యస్.పి.రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Change News Type