కోరుట్ల

పోచమ్మ బోనాలలో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com

July 25th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని ఏసికొని గుట్ట 23వ వార్డులో ఆషాడ మాసం బోనాల సందర్భంగా అమ్మవారికి ఘనంగా బోనాల ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ. ప్రజలు సుభిక్షంగా ఉండాలని పాడి పంటలకు లోటు లేకుండా కోరుట్ల నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలలో జువ్వాడి కృష్ణారావుతో పాటు స్థానిక వార్డ్ కౌన్సిలర్ పుప్పాల ఉమాదేవీ ప్రభాకర్, ఎంభేరి నాగభూషణం, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button