
viswatelangana.com
చత్రపతి శివాజీ మహారాజు కుమారుడైన ధర్మవీర్ సంభాజీ మహారాజ్ యొక్క వర్ధంతి సందర్భంగా కోరుట్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈమద్యే తెలుగులో రిలీజ్ అయిన సంబాజీ మహారాజ్ యొక్క “చావా” చిత్రాన్ని కోరుట్ల పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాల పిల్లలకు వీక్షింపజేశారు. అలాగే మార్చి 14వ తేదీన జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భవ దినోత్సవ సభను పురస్కరించుకుని “చలో పిఠాపురం” పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు వడ్నాల రామారావు మాట్లాడుతూ మన భారత దేశ రక్షణ, ధర్మరక్షణ కొరకు పోరాడిన షూర వీరుల, మహానీయుల గాధలను నేటి తరం పిల్లలకు తెలియజేయడం మన కర్తవ్యమని, అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను బోధించడం ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల కర్తవ్యం కూడా ఉంటుందని అన్నారు. మన దేశ చరిత్రను తెలిపే ఈ “చావా” చిత్రం పిల్లలలో దేశభక్తిని నింపడానికి తోడ్పడుతుంది, కావున కోరుట్ల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని పిల్లలకు చూపించడం జరిగిందని అన్నారు. అలాగే “చలో పిఠాపురం” సభకు వచ్చే జనసైనికులు, అభిమానులు తమను సంప్రదించడానికి 9010431999, 9030458143 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు వోడ్నాల రామారావు, జనసైనికులు సాయికృష్ణ, విజయ్, శశి, సురేష్, ప్రశాంత్, అనిల్, రాజేందర్, భీమరాజ్, అభినవ్, సంజీవ్ మరియు సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు సురేష్, సంపత్, అమరనాథ్, జగదీశ్, నరేందర్, అదేవిధంగా సరస్వతి శిశు మందిర్ ఉపాధ్యాయులు మరియు కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.



