కోరుట్ల

అయిలాపూర్ రోడ్డు సంక్షేమ సంఘం కోరుట్ల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

viswatelangana.com

August 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుట్ల పట్టణం లోని ఐలాపూర్ రోడ్డు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. వేలమంది తమ ప్రాణాలు త్యాగాలు చేస్తే సిద్ధించిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి నేటి తరానికి తెలియ జేసి వారిలో దేశ భక్తి నీ పెంపొందించాలి పేర్కొన్నారు. పక్కన ఉన్న మన శత్రు దేశాలను ఒక కంట కనిపెడితూనే మన దేశం అభివృద్ధి లో మనందరం భాగ స్వామ్యం కావాలి ఈ సందర్భంగా ఐలాపూర్ రోడ్ ఏరియాను పరిశుభ్రంగా ఉంచుతూ ఉత్తమ సేవలందించినందుకు గాను కోరుట్ల మున్సిపల్ సిబ్బంది లంకా రాజేష్ (జవాన్) ను ఐలాపూర్ రోడ్డు సంక్షేమ సంఘం తరఫున ఘనంగా సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మార్గం నరేష్ కుమార్, గోనె మురళి, శ్రీ గద్దే నరేందర్, ఆదిరెడ్డి, సంతోష్, శీను, రత్నాకర్, నవీన్ గౌడ్, బుచ్చయ్య, రమేష్, శ్రీనివాస్, సూరిబాబు, నాగరాజు, గంగాధర్, లక్ష్మీనారాయణ, ప్రదీప్, రాజు, సంజయ్, సురేందర్, బాలరాజు మిగతా సభ్యులు శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించారు

Related Articles

Back to top button