మేడిపల్లి
పోరుమల్ల గ్రామంలో మడెల్లయ్య బోనాల జాతర

viswatelangana.com
June 20th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
పోరుమల్ల గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో మాడెల్లయ్య బోనాల జాతర కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ప్రత్యేక ఆహ్వానంతో హాజరైన మేడిపల్లి మండల అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి బీమారం మండల అధ్యక్షులు రాష్ట్ర ఎన్ఆర్ఐ గల్ఫ్ కన్వీనర్ కాంగ్రెస్ పార్టీ సింగిరెడ్డి నరేష్ రెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతు మడెల్లయ్య స్వామి దివేనలతో రజకులు గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరారు. వారిని రజక సంఘా పెద్ద మనుషులు సభ్యులు శాలవతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ మండల అధ్యక్షులు మాదం వినోద్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు భూమారెడ్డి,తిరుపతి రెడ్డి, సూర్యం, శ్రీను, ప్రణయ్, రాజు, సాయిలు, జగత్ రెడ్డి, రాజశేఖర్, సిద్ధయ్య, మరియు రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.



