మెట్ పల్లి

పోలీస్ కళ బృందం ద్వారా అవగాహన.

viswatelangana.com

February 27th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తోబార్రావు పేట  గ్రామం లో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల యొక్క ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని  గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం  జరుగుతుందని దీని వల్ల గ్రామంలో ఏ సంఘటన జరిగిన వెంటనే తెలుస్తోంది అని తెలిపారు.సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించలని గ్రామస్థులను కోరారు.తల్లిదండ్రులు  పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదని, ప్రభుత్వం, పోలీస్ తరపున అన్ని విధాల సహాయహకారులు ఉంటాయని అన్నారు. వాహన దారులు తాగి డ్రైవింగ్ చేయవద్దని, లైసెన్స్  లేకుండ వాహనాలు నడపవద్దని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఆవశ్యకత గురించి వివరించారు. గ్రామాల్లో అనుమానస్పదంగా వ్యక్తులు కనపడితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వున్న పోలీస్ స్టేషన్ కు తెలియపరచాలని తెలిపారు. గ్రామంలో  చిన్న చిన్న తగాదాలకు పోయి జీవితం నాశనము చేసుకొవద్దని, నేరరహిత గ్రామాలుగ చేయడానికి ప్రజలు కృషి చేయాలనీ సూచించారు. మంత్రాలు తత్రాలు ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస వున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో తెలపాలి ,లేదా 100 నెంబర్ కు ఫోన్ చేస్తే నిమిషాల్లో పోలీసులు తమ వద్దకు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్యామ్ రాజ్,  గ్రామ ఎంపీటీసీ,మాజీ సర్పంచ్, పోలీసు సిబ్బంది, పోలీస్ కళా బృందం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button