పోసానిపేట గ్రామంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్
ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో శనివారం ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పర్యటించారు.. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి గ్రామానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్ ను గ్రామస్తులు వివిధ కుల సంఘాల సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో మీ ముందుకు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని వచ్చానని మీరు నాపై నమ్మకం ఉంచి నన్ను వేములవాడ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీకు ఎల్లవేళలా రుణపడి ఉంటాను అన్నారు. గత పది సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు చరమ గీతం పాడుతూ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో తోడ్పాటున అందించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన మొదటి రోజే నా ఎమ్మెల్యే పదవిని వేములవాడ నియోజకవర్గం ప్రజలకు అంకితం చేశానని అన్నారు.. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకే నా ఎమ్మెల్యే పదవి మీకు అంకితం చేశాం అన్నారు. గతంలో చెప్పినట్టుగానే మీలో ఒకడిగా ఉంటూ మీ ఇంటి బిడ్డగా ఉంటూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తానన్నారు.. నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని కళ్లారా చూసానని మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పిడుగు జలపతి రెడ్డి, ఎల్లేటి జలపతి రెడ్డి , కే సి రెడ్డి రాజారెడ్డి, మాజీ సర్పంచ్ ఎంజీ రెడ్డి, గాంధారి శ్రీనివాస్, వివిధ సంఘ సభ్యులు పాల్గొన్నారు



