ప్రజాహితాయాత్ర ప్రారంభం
viswatelangana.com
మేడిపల్లి ప్రతినిధి: జగిత్యాల జిల్లా మేడిపల్లిలో శనివారం రోజున బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభించారు. గ్రామంలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ వారి సమస్యలపై ఆరా తీస్తూ . అంతకుముందు ప్రజాహిత ప్రారంభం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ బడ్జెట్ పై స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలపై నిప్పులు పెరుగుతూ .బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారుణంగా మోసం చేసింది అని, కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.5 లక్షల కోట్లకుపైగా అవసరం అని,బడ్జెట్ లో హామీల అమలు కోసం కేటాయించిన నిధులు రూ.53 వేల కోట్లు మాత్రమే అని, బడ్జెట్ సాక్షిగా బీసీలను దారుణంగా వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట్లాడడం జరిగింది.విద్యకు 16 శాతం నిధులు కేటాయిస్తామని హామీని పూర్తిగా విస్మరించిన పార్టీ కాంగ్రెస్, ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులకు పొంతనేలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చలేమని బడ్జెట్ సాక్షిగా చేతులెత్తేసిన కాంగ్రెస్, పీవీ నర్సింహారావును దారుణంగా వంచించిన పార్టీ కాంగ్రెస్, పీవీ చనిపోతే కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు కూడా జరపని నీచమైన పార్టీ, పీవీ ఘాట్ ను కూల్చేస్తామని మజ్లిస్ వార్నింగ్ ఇస్తే కనీసం నోరుమెదపని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, పీవీ ఘాట్ పై చేయి వేస్తే దారుస్సలాంను కూల్చేస్తానని వార్నింగ్ ఇచ్చిన పార్టీ బీజేపీ అని మాట్లాడడం జరిగింది.పీవీ కాంగ్రెస్ వాడైనప్పటికీ దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించి భారత రత్న పురస్కారం ఇచ్చిన ఘనత బీజేపీదే అంటూ మాట్లాడారు.బండి సంజయ్ కు అండగా ఎవరున్నారని కొందరు నేతలు కూస్తున్నారు. నాకు అండగా మోదీ, రాముడు ఉన్నడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్షాన రజాకార్ల పార్టీ, రాక్షసుల పార్టీ అండగా ఉంది. రామరాజ్యం కోసం తపిస్తున్న మోదీ పాలన కావాలా?రజాకార్ల రాక్షసులకు వత్తాసు పలుకుతున్న రాహుల్ పాలన కావాలా? నిరంతరం ప్రజల కోసం పోరాడే బండి సంజయ్ కావాలా?.విహార యాత్రల మాదిరిగా అప్పడప్పుడు వచ్చే నేతలు కావాలా? రాముడి వారసుల పార్టీ కావాలా?.రాక్షస వారసుల పార్టీలు కావాలా? దేవుడిని నమ్మే బీజేపీ కావాలా? దేవుడిని నమ్మకుండా హేళన చేసే పార్టీలు కావాలా?రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తారని ఎవరైనా ఊహించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రామ మందిరం నాది అని ప్రతి హిందువు గర్వపడేలా చేసిన మోదీ, అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అంటూ హిందువుల మనోభావాలను కాంగ్రెస్ హేళన చేస్తోంది. కాంగ్రెస్ నేతలకు కావాలంటే బాసుమతి బియ్యంతో చేసిన అక్షింతలను పంపేందుకు సిద్ధం. నిన్నటిదాకా అయోద్య రామమందిర నిర్మాణాన్ని హేళన చేసిన బీఆర్ఎస్ నేతలకు ప్రజా తీర్పుతో బుద్ది వచ్చింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం సరైనదేనని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నారు. అయోధ్యలో రాముడి పుట్టారనడానికి ఆధారాలేమిటని కాంగ్రెస్ నేతలు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు వాళ్ల అమ్మ కడుపులో పుట్టారనడానికి ఆధారాలేమిటి? అక్కడున్న డాక్టర్లు, నర్సులు చెబితేనే కదా తేలిసేది? ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల కష్టాలను తెలుసుకుని భరోసా ఇచ్చిన పార్టీ బీజేపీ.ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ మోదీ కులంపై ప్రశ్నించడం సిగ్గుచేటు. రాహుల్ గాంధీ అసలు పేరు రౌల్(తోడేలు) విన్సీ. మోదీ కులం భారతీయత.మోదీ మతం హిందూ మతం. రాహుల్ పప్పు..అసలు మీ కులమేంది? మీ మతమేందో చెప్పే దమ్ముందా? మీ తాత ఫిరోజ్ ది ఏ కులం, ఏ మతం? మీ అమ్మది ఏ దేశం, ఏ మతం, ఏ కులం? నరేంద్రమోదీ అందరి వాడు. ఈ దేశాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్న మహనీయుడు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో బాబ్రీమసీదు కడతారు. రాముడి గుడి కావాలా? బాబ్రీ మసీదు కావాలా?. ప్రజలారా తేల్చుకోండి. కేసీఆర్ పనైపోయింది..తాంత్రిక పూజలకు నిలయమైన ఫాంహౌజ్ కు ఎవరూ వెళ్లే సాహసం చేయడం లేదు.నేను చచ్చిపోవాలని, కాళ్లు చేతులు పడిపోవాలని కేసీఆర్ తాంత్రిక పూజలు చేసిండు. ఎవరు ఇతరుల నాశనం కోరుకుంటే చివరకు వాళ్లే నాశనమైపోతారు.బండి సంజయ్ ఏం చేశాడని ప్రశ్నించిన నేతల మూత వేయించేందుకే ప్రజాహిత యాత్ర. ఎంపీగా ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ అభివ్రుద్ది కోసం రూ.12 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన. వేములవాడ నియోజకవర్గ అభివ్రుద్ధికి రూ.590 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన ఘనత మోదీ సర్కార్ దే. గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి నిధులన్నీ మోదీ ప్రభుత్వానివే. మేడిపల్లిలో రోడ్ల కోసమే రూ.20 కోట్లు కేంద్రం ఇచ్చింది.మేడిపల్లి మండలానికి ఉపాధి హామీ పనుల కోసం రూ.5 కోట్ల 16 లక్షలు ఇచ్చాం.రోడ్ల కోసం కోటి రూపాయలకుపైగా ఇచ్చాం. మరుగుదొడ్ల కోసం 30 కోట్లకుపైగా నిధులిచ్చాం. ఆర్దిక సంఘం నిధుల కోసం 2 కోట్లకుపైగా నిధులిచ్చాం.దమ్ముంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి ఎంపీలుగా చేసిన నేతలు కరీంనగర్ కోసం ఏం చేశారో చెప్పాలి. వేములవాడ నియోజకవర్గ అభివ్రుద్ధికి రూ.590 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన ఘనత మోదీ సర్కార్ దే. నేను నా జీవితాన్ని ప్రజల కోసమే ధారపోస్తున్నా. నాకు సొంత వ్యాపారాల్లేవు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిరిగా దోచుకోలేదు. ప్రజాసంగ్రామ యాత్రతో రాష్ట్రమంతా తిరిగిన,ప్రజల కోసం కొట్లాడి 100కుపైగా కేసులు పెట్టినా భయపడలేదు. బండి సంజయ్ ఏం చేశాడో. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు.మేడిగడ్డ కూలిపోవడానికి కారణం స్వయం ప్రకటిత మేధావే, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టు పొందిన సంస్థను బెదిరించి తన వాళ్లకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది నిజం కాదా? ఆ సంస్థ చేసిన పనులవల్లే ఇయాళ మేడిగడ్డ పిల్లర్లు వంగిపోవడం నిజం కాదా?. స్వయం ప్రకటిత మేధావి దమ్ముంటే గుండెమీద చేయివేసి నిజం చెప్పాలే అంటూ ఘాటు మాటలు మాట్లాడారు.పేదల కోసం యుద్దం చేస్తున్న బండి సంజయ్ ను గెలిపించండి. నరేంద్రమోదీని మళ్లీ ప్రధాని చేసేందుకు అందరం కంకణం కట్టుకుందాం. అందుకే ప్రజా హిత పాదయాత్ర ప్రారంభిస్తున్నా. నిండు మనసుతో ఆశీర్వదించి, ప్రజాహిత యాత్రను విజయవంతం చేయండి అని ఈ సందర్భంగా ప్రజలను కోరడం జరిగింది.



