ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట
కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగ్ రావు

viswatelangana.com
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో బుధవారం రోజున కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు చేతుల మీదుగా మహాలక్ష్మి (సిలిండర్ల సబ్సిడీ) ప్రొస్డింగ్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ… ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహాలక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళా సాధికారిక దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారిపై ఆర్థిక భారం తగ్గించడం కోసం.వారికి కాలుష్య రహిత వంట వండుకోవడానికి ఈ పథకంలో ఎంపికైన కుటుంబాలకు వినియోగం ఆధారంగా ఎల్పిజి సిలిండర్ లో పరిమితం చేయబడతాయని, లబ్ధిదారులు సిలిండర్ అందిన తర్వాత సబ్సిడీ నగదు మీ బ్యాంకు ఖాతాలో నాలుగు రోజుల్లో జమ అవుతుందన్నారు. ఒకవేళ జమకాని లబ్ధిదారులు ఉన్నట్లయితే ప్రొసీడింగ్ పత్రాలలో ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మన ఖాతాకు సబ్సిడీ అమౌంట్ను క్లియర్ చేసుకోవచ్చునన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని తెలిపారు. అదే విధంగా గ్రామ అభివృద్ధి కోసం సైతం రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కి జోగన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, కోరుట్ల వ్యవసాయ కమిటీ చైర్మన్ పన్నాల అంజి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ, ఎ.ఏం.సి డైరెక్టర్ బలవంత రెడ్డి, బిసి సెల్ మండల అధ్యక్షులు ముక్కెర లిబంద్రి, కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ ఉపధ్యక్షుడు సైదు గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షులు సహదేవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ బద్దం నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దం గౌతం రెడ్డి, పోతవేని శేఖర్, ఇంద్రాల హరీష్, బూర్గుల శ్రీహరి, ఇంద్రాల అశోక్, నక్క నర్సయ్య,మురళీధర్ రెడ్డి, ఎల్పుల అంబేద్కర్, ముత్యపు రాజశేఖర్, తేలు శ్రీను, సిద్దే లక్ష్మణ్, కట్కూరి శ్రీధర్, కొమ్ము శ్యామ్ కుమార్, బోయిని రమేష్, సట్టరాజేష్, కొమ్ము శంకర్, సంతోష్, గోపాల్ రెడ్డి, రాజలింగం, రాహుల్ మరియు రేషన్ డీలర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



