రాయికల్
ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించిన ఎంఈఓ రాఘవులు

viswatelangana.com
May 4th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాలలో చక్కటి ప్రతిభ కనబరిచారు 544 మార్కులు సాధించిన ఏముండ్ల శైలజ 543 మార్కులు సాధించిన కండ్లపల్లి రక్షిత 539 మార్కులు సాధించిన పెద్ది మహితలను ఎంఈఓ రాఘవులు అభినందించారు.19 మంది విద్యార్థులకు 500 పైగా మార్కులు రావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వీరికి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను, సహకరించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు రావడం పట్ల ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పొన్నం రమేష్, మండ లోజు రవీందర్, చిప్ప మల్లేశం, గంగ జమున, సత్యనారాయణ, గంగాధర్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



