రాయికల్

ప్రతి మహిళ సమాజాన్ని ఎదిరించే శక్తిగా ఎదగాలి

viswatelangana.com

March 8th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం ప్రగతి ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలే జయశ్రీ శేఖర్ మాట్లాడుతూ మహిళ స్త్రీ శక్తి స్వరూపిణి అని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని,అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే కాకుండా ప్రతీ రోజు మహిళలు వారి అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని,మహిళలు తలుచుకుంటే కానిదేది లేదని, ప్రతీ మహిళ సమాజాన్ని నడిపించే శక్తిగా ఎదగాలన్నారు. ప్రతీ మహిళ విజయం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి శాయశక్తుల కృషి చేయాలని, ప్రపంచంలో సగభాగానికి పైగా మహిళలే ఉన్నారని, ఎన్నోరంగాల్లో ముందుండి స్ఫూర్తిగా నిలుస్తున్నారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళ ఉపాధ్యాయిని బృందానికి, విద్యార్థినిలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థినిలు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button