రాయికల్
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బైకు ర్యాలీ

viswatelangana.com
June 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా రాయికల్ రేంజ్ అటవీ అధికారులు గురువారం రేంజ్ కార్యాలయం నుండి చింతలూరు అటవీ ప్రాంతం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాయికల్ రేంజ్ ఆఫీసర్ టీ భూమేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది అందరి బాధ్యతని మరియు ప్లాస్టిక్ నిర్మూలన గురించి విద్యార్థులు, గ్రామస్తులలో అవగాహన కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చింతలూరు సెక్షన్ ఆఫీసర్ ఎస్ మల్లన్న బీట్ అధికారులు ఎం రమణారెడ్డి, పాష, చంద్రశేఖర్, ఇలియాస్ కవిత, విజయ, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



