కోరుట్ల
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే
viswatelangana.com
January 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆకస్మిక తనిఖీ చేశారు అనంతరం ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి అందుతున్న వైద్య చికిత్సలను అడిగి తెలుసుకున్నారు వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే ఆసుపత్రిలోని మౌలిక వసతులపై సూపరింటెండెంట్ తో చర్చించారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్, అన్నం అనీల్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు



