ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ

viswatelangana.com
మెట్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి డాక్టర్ కే. వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో పలు విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని ప్రణాళికబద్దమైన కృషితో చదవడంతో పాటు, తల్లిదండ్రులు గురువుల పట్ల సత్ప్రవర్తన కలిగి భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని దిశా నిర్దేశం చేశారు. అనంతరం కళాశాల సాధించిన ఫలితాలు, ప్రిన్సిపాల్, సిబ్బంది పనితీరు పట్ల అభినంధనలు తెలిపారు. కళాశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. అన్ని కళాశాలలో ఈవిద్యా సంవత్సరంలో జె.ఇ.ఇ,నీట్, టి.జి.ఇ.ఎ.పి సెట్ పరీక్షలకు శిక్షణపై ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయని కళాశాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ వెంకటేశ్వరరావు, మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందము విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



