ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

viswatelangana.com
ప్రభుత్వ జూనియర్ కళాశాల మెట్ పల్లి యందు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ఆర్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన “చాకలి ఐలమ్మ జయంతి”కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని తెలంగాణ మహిళల వీరత్వం పౌరుషాన్ని ప్రపంచానికి చాటి మహిళా పోరాట శక్తికి ప్రతికగా, బానిసత్వాన్ని వ్యతిరేకించి దొరల గడిల పునాదులను కదిలించిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి గోవిందుల వెంకటేష్ అధ్యాపకులు సి హెచ్ శ్రీనివాస్. జగపతి, శ్రీనివాస్, మహేశ్వరి, నర్సయ్య రాజేశ్వరరావు, సుదర్శన్,ప్రతిభ మంజుల, స్వర్ణలత, జమున, జాకీర్, నాగేశ్వర్, జ్ఞానేశ్వర్, ఫాతిమా మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



