కోరుట్ల
ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మానసిక ఒత్తిడిపై అవగాహన కార్యక్రమం

viswatelangana.com
October 24th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక బత్తిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ గౌసూర్ రెహమాన్ మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండి విద్య నభ్యసించాలని, అవసరానికి మించి చరవాణిని ఉపయోగించరాదని, ప్రశాంతమైన వాతావరణంలో విద్యనభ్యసించి పట్టుదలతో ముందుకెళ్లాలన్నారు. పోటీ పరీక్షలలో రాష్ట్ర స్థాయి రాంకులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పివో ఎం.గంగా ప్రసాద్,అధ్యాపకులు నటరాజన్, శ్రీనివాస్, మోయిజోద్దిన్, సుబ్రమణ్యం, ప్రణీత్, సాయికృష్ణ, స్వరూప, సంధ్య తదితరులు పాల్గొన్నారు.



