viswatelangana.com
Date of Publish : 24 January 2025, 1:45 pm Digital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రభుత్వ పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రాన్ని రాయికల్ మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు,విద్యార్థులు మీ సేవలో అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీ సేవ కేంద్రం నిర్వాహకులు గంట్యాల ప్రవీణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Change News Type