కథలాపూర్

వాలీబాల్ క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేసిన నాయకులు

viswatelangana.com

February 9th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణ్ రావు పేట గ్రామంలో వాలీబాల్ పోటీలు నిర్వహించగా వారికి ప్రథమ, ద్వితీయ మరియు ప్రోత్సాహక బహుమతులకు పలువురు నాయకులు సహాయ సహకారాలు అందజేయడం జరిగింది. వీరిలో మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, వాకిటి రాజారెడ్డి, మాజీ సర్పంచ్ కూన సులోచన శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు కొండా నవీన్, ఫాతిమా, బ్యాంకు మేనేజరు శ్రవణ్ కుమార్, గడ్డం చిన్నారెడ్డి, ప్రేమ్ సాగర్, బెజ్జారపు శివరాం తదితరులు వాలీబాల్ టోర్నమెంట్ కు దాతలుగా నిలిచారు.ఈ కార్యక్రమంలో ఎంపిటీసి ఆంజనేయులు, వర్దినేని నాగేశ్వర్ రావు,డా. కృష్ణ,వాలీబాల్ టీమ్ సభ్యులు అర్షద్, రాజేందర్,మహేందర్, వివేక్, సుబు, రాహుల్, శ్యామ్, రాజన్, శ్రీకాంత్, శ్రీను, శ్యామ్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button