Date of Publish : 18 September 2024, 2:11 pmDigital Edition : VISWA TELANGANA DAILY NEWS
ప్రభుత్వ పాఠశాల లో పాము హల్ చల్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఒక పాము హల్ చల్ చేసింది. పాఠశాల ఆవరణలో పాము తిరుగుతుండటంతో పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అధికారులు, నాయకులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.