రాయికల్
ప్రభుత్వ బాలికల పాఠశాలలో మొక్కలు నాటిన ఉపాధ్యాయులు

viswatelangana.com
June 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రపంచ చెట్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు శ్రీపతి రాఘవులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఆవరణలో మొక్కలను నాటాలని విద్యార్థులకు సూచించారు దేశంలో వాతావరణ కాలుష్యం రోజు రోజుకి పెరుగుతున్నది కావున వాతావరణ కాలుష్యం తగ్గించడానికి సకాలంలో వర్షాలు కురవాలన్నా ప్రతి ఒక్కరు తన ఇంటి ముందు ఒక చెట్టును నాటాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొన్నం రమేష్ రవీందర్ మల్లేశం గంగ జమున సత్యనారాయణ నాగరాజు గంగాధర్ వనిత శివానందం యాస్మిన్ ఫాతిమా పద్మజ పిడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు



