
viswatelangana.com
చెరువులు, కుంటలు, బఫార్ జోన్ లతో పాటు శిఖం, ఎఫ్.టి.ఎల్, కాల్వలు, రోడ్లు, దేవాలయ పురావస్తు, వక్ భూములు, వాగు ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల కబ్జాదారులపై ఉక్కుపాదం మోపె హైడ్రా చట్టం అభినందనీయమని, దాన్ని కోరుట్లలో కూడా అమలు చేయాలని తీర్మానించినట్లు కోరుట్ల డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్ష కార్యదర్శులు చెన్న విశ్వనాథం, పేట భాస్కర్ లు తెలిపారు. మంగళవారం కోరుట్ల లోని సి ప్రభాకర్ గ్రంథాలయంలో జరిగిన ఫోరమ్ సమావేశంలో పట్టణానికి చెందిన పలు అంశాలపై చర్చించారు, భూ కబ్జాలపై అధికారులకు పిర్యాదులు చేయాలని స్థానిక ఎంపి, ఎమ్మెల్యే, అధికార పార్టీ ఇంచార్జీ లను కలిసి హైడ్రా చట్టం కోరుట్లలో అమలు జరిగేల చూడలని కోరనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు నేతలు వివిధ సంఘాల్లో రాష్ట్ర జిల్లా స్థాయిలో ఎదిగినందుకు గాను డాక్టరేట్, జాతీయ సేవ రత్న అవార్డు పొందిన పేట భాస్కర్, జగిత్యాల మున్నురుకాపు సంఘం జిల్లా నూతన అధ్యక్షులు చెదలు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, బండారు శంకర్ లను ఫోరమ్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈసమావేశంలో ఫోరమ్ నాయకులు రాసకొండ పెద్ద దేవయ్య, రాడం అశోక్, షాహేద్ మహ్మద్ షేక్, సుతారి రాములు, రాస భూమయ్య, ఆలీ నవాబ్, రామిల్ల రాంబాబు, తిరుపతి నాయక్, ఇట్యాల రాజేందర్, నాగేశ్వరరెడ్డి, గణేష్, బుచ్చిరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




